Gang war between hijras in hyderabad: హైదరాబాదులో హిజ్రాలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. బంజారాహిల్స్ లో నడిరోడ్డు పై కూర్చుని వీరంగం సృష్టించారు. ఏరియాలో పంచుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు. నకిలీ ఒరిజినల్ అంటూ గ్యాంగ్ వార్లకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిజ్రా గ్యాంగ్ రెచ్చిపోయింది. రౌడీలను మెయింటైన్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ గ్రూపు తగాదాల గొడవ పోలీస్ స్టేషన్ కు చేరింది. తమను రౌడీలతో కలిసి వేధిస్తున్న హిజ్రా నాయకురాలు మోనాలిసా మీద చర్యలు తీసుకోవాలంటూ ఓ వర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసుల విధులను అడ్డగించారు. దీంతో పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Extortion in Hyderabad: Third gender groups fight over who is original and who is fake and stage dharna infront of Banjara Hills police. Extortion of money by such groups increases a lot in Hyderabad.#Hyderabad #Thirdgender pic.twitter.com/OiJP1z1bYz
— Sudhakar Udumula (@sudhakarudumula) December 26, 2022