HYD: అర్ధరాత్రి పాతబస్తీలో గ్యాంగ్ వార్.. రక్తసిక్తమైన కాలనీ!

Gang War in Old City

Gang War in Old City |క్రికెట్ బాల్ విషయమై రెండు గ్రూపుల మధ్య భారీ ఘర్షన జరిగింది. బుధవారం అర్థరాత్రి హైదరాబాద్‌లోని పాతబస్తీలో తలెత్తిన ఈ వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్ళు, బ్యాట్‌లతో దాడులకు పూనుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయలయ్యాయి. చాంద్రాయణగుట్ట పోలీసుల వివరాల ప్రకారం.. పాతబస్తీ నూరీనగర్‌కు చెందిన ఇమ్రాన్‌కు ఈనెల 29వ తేదీన ఇంటర్ పరీక్షలు ముగిశాయి. బుధవారం రాత్రి తన స్నేహితులతో కలిసి ఇంటి ముందు క్రికెట్ ఆడుతున్నాడు. రాత్రి సమయంలో బంతి నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో పడింది. బంతి కోసం నిర్మాణంలో ఉన్న ఇంటికి ఇమ్రాన్​వెళ్ళాడు.

Gang War in Old City |అంతలోనే ఎవరు ఇంట్లోకి ఎలా వచ్చారంటూ సయ్యద్ ​అహ్మద్ ​ప్రశ్నించాడు. దీంతో వీరిరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఘర్షణ కాస్త పెద్దదై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇమ్రాన్ సోదరుడు సయ్యద్ అహ్మద్‌పై మొదట బ్యాట్‌తో దాడిచేశాడు. దీంతో అహ్మద్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అహ్మద్ తన అనుచరులు, బంధువులకు ఫోన్​చేసి పిలిపించుకున్నాడు. ఇమ్రాన్ ఇంట్లోకి వెళ్లి రాళ్ళతో దాడులు చేశారు. ఈ దాడిలో ముగ్గురు, నలుగురికి గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఇరువర్గాలను శాంతింపజేశారు.

Read Also: నయా రికార్డు.. తెలంగాణ చ‌రిత్రలోనే మొదటిసారి

Follow us on: Google News, Koo, Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here