Gnagula kamalakar: ఆంధ్ర పార్టీలు తెలంగాణకు అవసరమా?

0
Gangula Kamalakar

Minister Gangula kamalakar fires on oppositions: ఆంధ్ర పార్టీలు తెలంగామకు అవసరమా అని మంత్రి గంగుల కమలాకర్‌ ప్రశ్నించారు. పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్‌ లాంటి వారు తెలంగాణకు వస్తున్నారని మంత్రి విమర్శించారు. సమైక్య పాలన ఇదివరకే చూశామనీ.. మళ్లీ మీ పాలన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా, తెలంగామ అభివృద్ధి ఆగదని అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కరీంనగర్‌ ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. జీఎస్టీ మేము కడితే.. ఫలాలు మాత్రం గుజరాత్‌కా అని ప్రశ్నించారు. దేశ ప్రధానిగా ఉన్నత స్థానంలో ఉండి.. సీఎం కేసీఆర్‌ పట్ల ప్రతిపక్ష నేతగా మాట్లాడటం సరికాదని హితువు పలికారు. ప్రధాని కార్యాలయం ఆహ్వానం సీఎం కేసీఆర్‌కు పంపకపోవటమేనా బీజేపీ సంస్కృతి అని నిలదీశారు. తెలంగాణపై ఢిల్లీ పాలకులు ఎందుకు వివక్ష చూపుతున్నారని గంగుల కమలాకర్‌ (Gangula kamalakar) ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here