తెలంగాణలో గతేడాది జరిగిన ఈ-కార్ రేస్‌లో(E-car Race) రూ.55 కోట్ల కుంభకోణం జరిగిందని వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో పలువురు అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు మరుగున పడిపోయిన ఈ వ్యవహారం తాజాగా మున్సిపల్ శాఖ ఫిర్యాదులో మరోసారి వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ హైదరాబాద్ మున్సిపల్ శాఖ.. ఏసీబీ(ACB)ని ఆశ్రయించింది. ఈ-కార్ రేస్ నిధులు మల్లించడంపై విచారణ ప్రారంభించాలని ఏసీబీ అధికారులను విజ్ఞప్తి చేసింది మున్సిపల్ శాఖ. నిబంధనలకు విరుద్ధంగా నిధులు మల్లించడంపై కోర్టులో విచారణ జరగాలని కూడా కోరింది. దీంతో ఈ కేసు విచారణకు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ.. ప్రభుత్వానికి లేఖ రాసింది.
నిబంధనలకు విరుద్ధంగా ఈ-కార్ రేసింగ్(E-car Race) సంస్థ.. ఎఫ్ఈఓకు రూ.55 కోట్లు చెల్లించినట్లు మున్సిపల్ శాఖ ఆరోపించింది. రేస్ నిర్వహణ బోర్డు, ఆర్థికశాఖ, ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే రూ.55 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒప్పందాన్ని అతిక్రమించడంతోనే ఫార్మల్ ఈ-కార్ రేసింగ్ సీజన్ 10 రద్దయింది. గతేడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌లో ఈ రేస్ జరిగింది.