తెలంగాణాలోని ఎస్టీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులను విడుదల చేశారు. ప్రత్యేక పరిస్థితులున్న కారణంగానే ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు 6 శాతంగా ఉన్న రిజర్వేషన్‌నే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా కొనసాగిస్తూ వచ్చారు. కాగా, రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న గిరిజన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచుతామని సీఎం కేసీఆర్ చెప్పినట్లే.. నేడు 10 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.