గోషామహాల్ BJP ఎమ్మెల్యే రాజాసింగ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఒక్కసారిగా ఊడిపోయింది. కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ఏమీ జరగలేదు. అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా ధూల్ పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ఘటన పై స్పందించారు ఎమ్మెల్యే రాజాసింగ్. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని గత కొంతకాలంగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా.. తన భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు.
BJP MLA Raja Singh: రాజాసింగ్ కి తృటిలో తప్పిన ప్రమాదం
-