తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఉభయ సభలను శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) ప్రసంగించారు. ఇందులో ఆయన పలు విషయాలు పేర్కొన్నారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.
‘‘ఘనమైన సంస్కృతికి తెలంగాణ నిలయం. ప్రజల కోసం గద్దర్(Gaddar), అంజయ్య వంటి ఎందరో కృషి చేశారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నాం. సామాజిక న్యాయం. అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ అడుగులు వేస్తోంది. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలు, రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యం చాలా ఉంది. దేశంలో అత్యధిక ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ’’ అని ఆయన(Governor Jishnu Dev Varma) పేర్కొన్నారు.