తెలంగాణ గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) మరోసారి సీఎం కేసీఆర్(CM KCR) పై సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి స్టేట్ ఫస్ట్ సిటిజన్ గా తనకు ఆహ్వానం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రగతి భవన్(Pragati Bhavan).. రాజ్ భవన్(Raj Bhavan) దూర దూరంగా ఉంటున్నాయని తెలిపారు. దేశాధినేతలను అయిన కలవొచ్చు కానీ… ఈ స్టేట్ చీఫ్ ను మాత్రం కలవలేము అంటూ మండిపడ్డారు. కొందరు మాట్లాడుతారు కానీ పని చేయరంటూ గవర్నర్ పరోక్షముగా సీఎం కేసీఆర్ ను విమర్శించారు. డెవలప్మెంట్ అంటే ఒక ఫ్యామిలీ డెవలప్ కావడం కాదని, రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా పని చేయాలనీ అన్నారు. ఆ దిశగా పని చేసేందుకే ఉన్నామని, కానీ కొందరు చేసే పనిని కూడా వ్యతిరేకిస్తుంటారని అన్నారు. గతంలో అనేకసార్లు ప్రోటోకాల్ విషయంలో కూడా సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై((Governor Tamilisai)) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గచ్చిబౌలి జరిగిన జీ20 లో భాగంగా సీ20 సమావేశానికి హాజరైన తమిళిసై పై విధంగా కామెంట్స్ చేసారు.
Read Also: ఇకపై ఢిల్లీ కేంద్రంగానే కేసీఆర్ రాజకీయాలు.. ముహుర్తం ఖరారు
Follow us on: Google News, Koo, Twitter