ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)పై రాష్ట్ర గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రోటోకాల్ పాటించడం లేదని మరోసారి ఆరోపించారు. చాలా కాలంగా సీఎం తనని కలవలేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం గవర్నర్‌తో సీఎం కాలానుగుణంగా చర్చలు జరపడం తప్పనిసరి అని తమిళిసై తెలిపారు. కానీ తెలంగాణలో అలా జరగడం లేదని , సీఎం తనని గత రెండేళ్లుగా కలవలేదని చెప్పారు. గవర్నర్, సీఎంతో సత్సంబంధాలు ఉండాలని తమిళిసై వెల్లడించారు. మరోవైపు పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరో మూడు బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా వాటిలో తాజాగా ఒకదాన్ని తిరస్కరించి.. మిగిలిన రెండు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ వివరణ కావాలని, తిరిగి పంపించారు.
Read Also: చైనాకు చెందిన ‘మో’ అనే వ్యక్తి మంత్రి నిరంజన్ రెడ్డికి సంబంధం ఏంటి?
Follow us on: Google News, Koo, Twitter