తెలంగాణలోని మిర్చి రైతులు(Mirchi Farmers) కష్టాల కడలిని ఈదుతున్నారని, కనీస మద్దతు ధర లేక నానా అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దాయకర్ రావు(Errabelli Dayakar Rao) పేర్కొన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతులను ఆదోవాలని, వారి కష్టాలు తీర్చాలని, మిర్చికి కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్(BRS) హయాంలో రాజుల్లా బతికిన రైతులు ఇప్పుడు పూట గడవడం కష్టంగా దీన స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేరశారు.
వరంగల్‌లోని ఎనుమూముల వ్యవసాయ మార్కెట్‌ను(Enumamula Market) ఎర్రబెల్లి మంగళవారం సందర్శించారు. మార్కెట్లో రైతులను కలిసి పంటల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతుల సమస్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మిర్చికి రూ.25వేల మద్దతు ధర కల్పించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ తరపున ఆందోళనలు చేపడతామని ఆయన(Errabelli Dayakar Rao) హెచ్చరించారు.