Aadi Srinivas | కేసీఆర్ మాట తప్పినా.. రేవంత్ తప్పలేదు: ప్రభుత్వ విప్

-

వేములవాడ రాజ రాజేశ్వరి ఆలయ(Vemulawada Temple) అభివృద్ధి కోసం రూ.76కోట్ల నిధులు ప్రకటిస్తూ సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తమ ప్రభుత్వం మాట తప్పదని, ఇచ్చిన మాటపై నిలబడి తీరుతుందని అన్నారు. ఇందుకు ఈరోజు రేవంత్ ప్రకటించిన నిధులు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. గతంలో ప్రతి ఏటా వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి నాటి సీఎం కేసీఆర్ మాట తప్పారని గుర్తు చేశారు. కానీ నేటి సీఎం రేవంత్ మాత్రం చెప్పినట్లు రాజన్న ఆలయ అభివృద్ధి పెద్దమనసుతో భారీ నిధులు కేటాయించారని అన్నారు.

- Advertisement -

‘‘వెయ్యి‌ కోట్ల రూపాయలను వేములవాడ ప్రాంతానికి కెటాయించారు. ఆలయ అభివృద్ధికి రూ.76 కొట్లతో భూమిపూజ చేసుకున్నాం. ముంపు గ్రామాల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముంపు గ్రామాల ప్రజలందరికీ కూడా ఇస్తాం. ప్రభుత్వం లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ నలుగురే కనబడుతారు. చేనేత రంగానికి యారన్ డిపో అండగా ఉంటుంది. గత ప్రభుత్వం రెండు వందల కోట్లు బకాయిలు పెడితే మా ప్రభుత్వం ఇచ్చింది’’ అని చెప్పారు శ్రీనివాస్(Aadi Srinivas).

Read Also: టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: కిషన్ రెడ్డి
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...