BRS | బీఆర్ఎస్‌కు గ్రేటర్ డిప్యూటీ మేయర్‌ రాజీనామా

-

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు.

- Advertisement -

“పార్టీలో ఉద్యమకారులకు మనగడ లేదు. పాతికేళ్లుగా పార్టీలో ఉన్నాం. అయినా కానీ ఆశించిన స్థాయిలో తమకు ప్రాధాన్యత దక్కలేదు. కష్టకాలంలో వెంట ఉన్నప్పటికీ కార్యకర్తలకు ప్రాధాన్యత లేదు. పార్టీలో కష్టపడిన పనిచేసినా గుర్తింపు లేదు. కేటీఆర్‌ను కలిసేందుకు వెళ్లినా కూడా తమను పట్టించుకోలేదు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాం” అని లేఖలో పేర్కొన్నారు. కాగా ఆదివారం ఉదయం ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో దీపామున్షి సమక్షంలో డిప్యూటీ మేయర్ దంపతులు కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరితో పాటు ఆరుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా హస్తం కండువా కప్పుకోనున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిలు కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. గతంలో రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డిలు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. దీంతో వీరి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...