వరంగల్ హన్మకొండ కోర్టులో(Hanmakonda Court) బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపు రావడంతో కోర్టులో పనులు నిలిచిపోయాయి. పోలీసు బృందాలు డాగ్ స్క్వాడ్ సహాయంతో కోర్టులో సోదాలు నిర్వహించి, బాంబు లభించలేదని ప్రకటించారు. గుర్తు తెలియని దుండగుడు కోర్టు ఆవరణలో బాంబు పెట్టినట్లు న్యాయమూర్తికి ఇమెయిల్ పంపినట్లు నివేదికలు తెలిపాయి. అయితే, క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అది ఎవరో ఆకతాయిల పని అని అధికారులు ప్రకటించారు.