తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పుట్టినరోజు(KCR Birthday) సంబరాలను పార్టీ నేతలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హరీష్ రావు(Harish Rao) మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగమన్నారు. తెలంగాణకు కేసీఆర్ తో ఉన్న బంధం పేగుబంధమన్నారు. తెలంగాణ ప్రజలది, కేసీఆర్‌ది తల్లీబిడ్డల సంబంధమన్నారు. ‘‘1969 మలిదశ ఉద్యమ సమయంలో కేసీఆర్ వయసు 15 ఏళ్లు. అప్పుడే జైతెలంగాణ అని నినదించిన నాయకుడు కేసీఆర్. వేల గంటలపాటు మేధోమథనం చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
తెలంగాణ కోసం అన్ని పదవులను త్యాగం చేసిన మహానాయకుడు. తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ మొండిపట్టుదలే కారణం. తెంగాణ జైత్రయాత్రనో.. కేసీఆర్ శవయాత్రనో అని ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేసీఆర్ దీక్ష చేపట్టడంతో కేంద్రం కూడా దిగొచ్చింది. తెలంగాణను ప్రకటించింది. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్(Telangana Bhavan)లో ఘనంగా వేడుకలు నిర్వహించాం’’ అని Harish Rao తెలిపారు