Harish Rao: మోడీ చేసిన వ్యాఖ్యలపై హరీష్‌ రావు ట్వీట్

-

Harish Rao Reply to Modis Comments: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌ రావు స్పందించారు. ఆదివారం ట్విట్టర్‌‌లో.. ‘‘ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అంటున్నారు. ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్‌‌ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోడీ జీ.. దేశానికీ తెలంగాణకు ఏం చేశావని మేము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోడీ జీ.’’ అని పేర్కొన్నారు.

- Advertisement -

బేగంపేటలో ఏర్పాటు చేసిన సభలో శనివారం మోడీ మాట్లాడుతూ.. మునుగోడులో కమల వికాసం కనిపించిందని, ఒక అసెంబ్లీ సీటు కోసం తెలంగాణ సర్కారు మొత్తం మునుగోడుకు పోయిందని, తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపారని, తెలంగాణ కార్యకర్తలు బలమైన శక్తులని వారు ఎవరికీ భయపడరని పేర్కొన్నారు. రాష్ట్రంలో అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి కుటుంబం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, కుటుంబ పాలన, అవినీతి దేశ ప్రగతికి గొడ్డలిపెట్టు లాంటివని నేను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.

‘‘తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. ఇతరులు మోడీని విమర్శలు చేస్తారు.. వారిలో నిరాశ, నిస్పృహలు నిండి అలా చేస్తారు. కానీ మీరు పరేషాన్ కావొద్దు. వారు విమర్శలు, తిట్టేందుకు చేసేందుకే కొందరిని ప్రత్యేకంగా నియమించుకున్నారు. సాయంత్రం చాయ్ తాగి ఆ విమర్శలను, తిట్లను మరిచిపోండి. తిరిగి తెల్లారి ప్రజల్లో ఉండండి.. వారే మీకు రాజ్యాధికారం అందిస్తారు. నేను ఒక్కో టైమ్‌‌కి ఒక్కో దగ్గర ఉంటాను అందరూ నన్ను తిట్టుకుంటారు. నేను ప్రతిరోజూ కిలోల కొద్దీ తిట్లు తింటాను. ఆ తిట్లే నాకు న్యూట్రిషన్‌‌గా పని చేస్తాయి. కొత్తకొత్త తిట్లు వెతుకుతారు. మీరెన్ని తిట్టినా పట్టించుకోవద్దు.’’ అని మోడీ టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే..

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...