Harish Rao | రైతులను మోసం చేసినందుకా పండగ.. రేవంత్‌కు హరీష్ రావు ప్రశ్న

-

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు పండగ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవంతంగా రైతులను మోసం చేసినందుకేనా ఈ పండగ వేడుకలు అంటూ చురకలంటించారు. అంతేకాకుండా రైతు బంధు కంటే బోనస్ అందించడం ఎలా మేలు అవుతుందో చెప్పాలి? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌ను ఉద్దేశించి కూడా సెటైర్లు వేశారు.

- Advertisement -

‘‘సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతుబంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటు. రైతుబంధు కంటే సన్నాలకు ఇచ్చే రూ.500 బోనసే మేలు అని రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయం. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించింది. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గం’’ అని Harish Rao ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ.26 కోట్లు మాత్రమే. అదే రైతుబంధు కింద ఏడాదికి రూ.7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది.

మీరు మ్యానిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు రూ.15,000 చెల్లిస్తే ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. మరి రైతు బంధు కంటే, బోనస్ అందించడం రైతులకు మేలు ఎట్లవుతుందో వ్యవసాయ మంత్రి గారు, రేవంత్ రెడ్డి(Revanth Reddy) గారు సమాధానం చెప్పాలి’’ అని నిలదీశారు.

‘‘అధికారంలోకి రాగానే రుణమాఫీ సగం మందికి చేసి, సగం మందికి మొండి చేయి చూపారు. ఆ తర్వాత అన్ని పంటలకు బోనస్ అని, చివరకు సన్నాళ్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు రైతుబంధును శాశ్వతంగా రద్దు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధును బందు చేస్తారని కేసీఆర్ ముందే హెచ్చరించారు. అనుకున్నట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది.

రైతు భరోసా వస్తదని ఎదురుచూస్తున్న రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు మోసపోయినట్లేనా? రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్ రెడ్డి? మేనిఫెస్టోలో చెప్పి, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా రేవంత్ రెడ్డి? రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.

నేడు మహబూబ్ నగర్‌లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న వానకాలం రైతుబంధు తో పాటు, యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

Read Also: వేసిన ఓటే రైతుకు అభయహస్తమైంది: రేవంత్
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Elections | BJP మేనిఫెస్టోలో సంచలన హామీ?

Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్...

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...