తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు(Health Director Srinivasa Rao) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడె జిల్లాలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో డీహెచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాయత్తుల మహిమతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నట్లు ప్రకటించారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని వ్యాఖ్యానించారు. కాగా, ఈ మధ్య కాలంలో వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో డీహెచ్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే తన రాజకీయ అరంగ్రేటంపై క్లారిటీ ఇచ్చిన ఆయన.. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నట్లు సమాచారం.
Read Also: ఆపరేషన్ చేసి కడుపులో బట్టను వదలిన వైద్యులు
Follow us on: Google News, Koo, Twitter