ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narsimha)తో జూనియర్ డాక్టర్లు(TS Junior Doctors) జరిపిన చర్చలు ఫలించాయి. స్టైఫండ్ రెగ్యులర్‌గా వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరిన జూడాల వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రతి నెల 15వ తేదీ లోపు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే మిగిలిన సమస్యలపై చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
- Advertisement -
కాగా తమ సమస్యల పరిష్కారానికి నేటి నుంచి విధులకు హాజరు కావడం లేదని జూడాలు సమ్మె నోటీసు ఇచ్చారు. గత మూడు నెలల నుంచి తమకు రావాల్సిన స్టైఫండ్ సరిగా అందడం లేదని వాపోయారు. దీంతో సమ్మె నోటీసును అధికారులకు అందజేశారు.