హైదరాబాద్(Hyderabad) మహానగరంలో మరోసారి సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రానున్న మూడు రోజులపాటు హైదరాబాద్ నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇటీవల 10 రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం కారణంగా అతలకుతలమైన నగరం ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నా సమయంలో భారీ వర్షం కురవడం నగరవాసుల్లో ఆందోళన గురిచేస్తోంది.
Hyderabad | పంజాగుట్ట, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, కోటి, నాంపల్లి, బషీర్బాగ్, కాచిగూడ, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, రాజేంద్రనగర్, కాటేదాన్, శివరాంపల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మేడ్చల్, సికింద్రాబాద్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే జంక్షన్‌లలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆఫీసు వేళలు కావడంతో ఇళ్లకు తిరిగి వెళ్తున్నా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు.