తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పున:పరిశీలించాలని ఆదేశించింది.
కాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ను ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. వీరి నియామకాలను గవర్నర్ తమిళిసై కూడా ఆమోదించారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగిరింది. అయితే గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన గెజిట్‌ను గవర్నర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. గవర్నర్ నిర్ణయాన్ని వారు హైకోర్టులో సవాల్ చేయగా.. ఈమేరకు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.