‘కృష్ణుడి రూపంలో విగ్రహం పెట్టడానికి వీళ్లేదు’

-

ఖమ్మం(Khammam) పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నందమూరి తారకరామారావు విగ్రహ ఏర్పాటు వివాదాస్పదం అవుతోంది. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం(NTR Statue) పెట్టడానికి వీళ్లేదంటూ హిందూ సంఘాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. తాము ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకం కాదని.. అయితే కృష్ణుడు రూపంలో పెట్టడం సరికాదని అంటున్నారు. ఈ విగ్రహాన్ని చూసిన భవిష్యత్ తరాలు ఎన్టీఆర్ ను శ్రీకృష్ణుడు అనుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని.. యాదవ, కమ్మ సామాజిక వర్గాల ఓట్లు కోసమే ఈ రూపంలో ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ప్రారంభిస్తే ఊరుకోమని, దీన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇప్పుడీ అంశం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా 28 మే 2023న ఖమ్మం(Khammam)లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar) ఆధ్వర్యంలో జయంతి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని లకారం చెరువులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

- Advertisement -
Read Also: పవన్ కల్యాణ్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...