జీతాలు సరిగా ఇవ్వడం లేదని.. అధికారుల వేధింపులు భరించలేక ఇటీవల ఆత్మహత్యయత్నం చేసిన హోంగార్డు రవీందర్(Home guard Ravinder) మృతిచెందారు. అపోలో ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న రవీందర్ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. హోంగార్డు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గోషామహల్ హోం గార్డు ఆఫీసులో ఆదివారం ఉదయం జీతాలు సరిగా ఇవ్వట్లేదని పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోవడంతో రవీందర్ శరీరం సుమారు 70 శాతం కాలిపోయింది. దీంతో ఆయనను చికిత్స కోసం DRDO అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే కీడ్నీ, లివర్ పనీతిరు పూర్తిగా విషమంగా మారడంతో రవీందర్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
Home guard Ravinder | మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి వద్ద భార్య సంధ్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. తన భర్తది ఆత్మహత్య కాదని, ఉన్నతాధికారులు చేసిన హత్య అని ఆరోపించారు. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. 17 సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేసిన తన భర్తను వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ కన్నీటిపర్యంత మయ్యారు. తన భర్త ఫోన్‌ను తీసుకున్న పోలీసులు దానిని అన్ లాక్ చేసి అందులోని డాటా మొత్తాన్నీ తొలగించారని సంధ్య ఆరోణలు చేశారు. ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.