అగ్నిప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ(Mahamood Ali) గురువారం పోస్టర్లు విడుదల చేశారు. చిన్న చిన్న పొరపాట్లు ప్రమాదాలకు కారణామవుతాయని చెప్పారు. అప్రమత్తంగా ఉంటే వీటిని నివారించవచ్చాన్నారు. 86,210 పోస్టర్లు, లక్షా 67 వేల కరపత్రాలు, 25బ్యానర్లు, 10,350 స్టిక్కర్లు విడుదల చేశారు. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చెయ్యనున్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, డైరెక్టర్ లక్ష్మీప్రసాద్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.