మరో ఎగ్జామ్‌ను వాయిదా వేసిన టీఎస్‌ పీఎస్సీ

-

Horticulture Officer Exam |డైరెక్టరేట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ పరిధిలోని హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల నియామక పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వాయిదా వేసింది. ఈ మేరకు మంగళవారం టీఎస్‌ పీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెల 4న జరగాల్సిన హార్టికల్చర్‌ ఆఫీసర్‌ నియామక పరీక్షను.. జూన్‌ 17వ తేదీకి రీ షెడ్యూల్‌ చేసినట్లు ప్రకటనలో తెలిపింది. జూన్‌ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష ఉంటుందని వెల్లడించింది. 22 మంది హార్టికల్చర్‌ ఆఫీసర్‌ల(Horticulture Officer Exam) నియామకం కోసం టీఎస్‌పీఎస్‌సీ 2022 డిసెంబర్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2023 జనవరి 3 నుంచి జనవరి 24 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో ఇప్పటికే ప్రకటించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను మారుస్తున్నట్లు టీఎస్పీఎస్సీ బోర్డు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సమయం పడుతున్న నేపథ్యంలోనే హార్టీకల్చర్ పరీక్షను వాయిదా వేసినట్టు సమాచారం.

- Advertisement -
Read Also: తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ramamurthy Naidu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం

తమ్ముడు నారా రోహిత్(Nara Rohit) తండ్రి నారా రామ్మూర్తి నాయుడు(Ramamurthy Naidu)...

Glowing Skin | చలికాలంలో మెరిసిపోయే చర్మం కోసం టిప్స్

Glowing Skin | చలికాలంలో డ్రై స్కిన్ వేధిస్తుంటుంది. దీనికి తోడు...