Falaknuma Train Fire | ఫలక్ నుమా రైలు ప్రమాద ఘటనతో రైల్వేకి ఎంత నష్టం?

-

Falaknuma Train Fire |ఫలక్ నుమా రైలు అగ్నిప్రమాద ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని క్లూస్ టీమ్ అనుమానిస్తోంది. S4 బోగీలోని మూత్రశాల వద్ద విద్యు శాతం జరిగినట్టు భావిస్తున్నారు. S4 బోగీలో షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన మంటలు నిమిషాల్లో మిగతా బోగీల్లోకి వ్యాపించినట్టు క్లూస్ టీమ్ గుర్తించింది. ప్రమాదంలో కాలిపోయిన 5 బోగీలను క్లూస్ టీమ్ శనివారం పరిశీలించి.. వందకు పైగా నమూనాలను సేకరించింది. నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు ఖచ్చితంగా తెలిసే అవకాశముంది.

- Advertisement -

Falaknuma Train Fire |విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు లేదా, ఓవర్ హీట్ వల్ల వైర్లలో మంటలు వచ్చి ఉండొచ్చని క్లూస్ టీమ్ అనుమానిస్తోంది. పశ్చిమ బెంగాల్ లోని హావ్డా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పురపాలిక పరిధిలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి శివారులో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దట్టమైన మంటల్లో చిక్కుకుని 5 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ దుర్ఘటనతో రైల్వేకు రూ.20 కోట్ల మేర ఆస్తినష్టం సంభవించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదృష్టవశాత్తూ పగటిపూట కావడం, ప్రయాణికులు మేలుకుని ఉండడంతో మంటలు చెలరేగకముందే అందరూ కిందికి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Read Also:  ఫలక్ నుమా రైలు ప్రమాదం.. వేల ప్రాణాలు కాపాడిన ‘ఆ ఒక్కడు’

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...