Husband who poured petrol on his wife and set her on fire Crime in Hyderabad: హైదరాబాద్‌లోని నారాయణగూడలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై పథకం ప్రకారం పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ భర్త. మొదటి భర్తతో గొడవల కారణంగా మరొకరితో వివాహేతర సంబందం ఏర్పడి.. అతడిని రెండో వివాహం చేసుకుని ఒక బాబుతో ఉంటుంది. ఓ మహిళ. అయితే ఈవిషయం తెలుసుకున్నమొదటి భర్త భార్యపై కోపంతో ఆమెను మట్టుపెట్టాలని పథకం వేశాడు. కాగా.. ఆటైం కోసం ఎదురు చూసాడు. సోమవారం రాత్రి నారాయణగూడ ఫ్లైఓవర్ కింద రెండో భర్తతో తన భర్య కనిపించడంతో తన కొడుకు కూడా ఉన్నాడు అనే విషయన్ని పట్టించుకొకుండా.. ముగ్గురుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ ముగ్గురికి గాయాలు అయ్యాయి. స్థానికులు బాధితులను గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. చిన్న బాబు 40 శాతం పైగా కాలిపోవడంతో పరిస్థితి సీరియస్‌గా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.