Hyderabad |భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భగభగ మండుతున్న సూర్యుని ప్రతాపానికి అల్లాడుతున్న హైదరాబాద్ వాసులను వరుణదేవుడు కరుణించాడు. బుధవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులు నగర ప్రజలకు ఊరట కలిగించాయి. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మేఘామృతమై ఉన్నప్పటికీ వర్షం జాడలేదు. అయితే ఈ రోజు సాయంత్రం హైదరాబాదులోని పలు ఏరియాల్లో చిరుజల్లులు కురిశాయి. ఈసీఐఎల్, సైనిక్పురి, జూబ్లీహిల్స్, బోడుప్పల్, బేగంపేట ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
- Advertisement -
Read Also:
1. తెలంగాణకు విముక్తి కోసం ఏకమవుతున్నాం: రేంవత్, పొంగులేటి
2. ఆ విధానాలు ఇప్పుడు పనికిరావు: విజయసాయిరెడ్డి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat