హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థత

-

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య(Sandeep Shandilya) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉండగానే ఒక్కసారిగా ఆయన తీవ్ర ఛాతీ నొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనను హుటాహుటిన పోలీస్ సిబ్బంది హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శాండిల్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో శాండిల్యను సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ స్థానంలో సందీప్‌ శాండిల్యను హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. దీంతో ఆయన ప్రస్తుతం నగర సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1993 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సందీప్ శాండిల్య(Sandeep Shandilya) తెలుగు రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. . 2016 నుంచి 2018 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సేవలందించారు.

Read Also: ఊర మాస్‌ అవతారంలో వైష్ణవ్ తేజ్.. ‘ఆదికేశవ’ ట్రైలర్ విడుదల మెగా హీరో
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

స్వీట్స్ తినకుండా ఉండలేకపోతున్నారా.. ఈ వార్త మీకోసమే..

Eat Sweets | స్వీట్స్ అందరికీ నచ్చేవి.. ఊరించేవి. ఆ తర్వాత...

గవర్నర్ హరిబాబును ఐసీయూకి షిఫ్ట్ చేసిన వైద్యులు..

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు(Kambhampati Haribabu) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను...