Hyderabad |తెలంగాణ హైకోర్టు ఎదుట దారుణ ఘటన కలకలం రేపింది. పదివేల కోసం ఓ వ్యక్తిని హత్య చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. వ్యక్తిని హత్య చేసిన అనంతరం నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…
Hyderabad |చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైకోర్టు గేట్ నెంబర్ 6 వద్ద గురువారం ఉదయం ఓ హత్య జరిగింది. ఈ ఘటనలో హత్యకు గురైన వ్యక్తి మిధున్ గా పోలీసులు గుర్తించారు. మిథున్ స్థానికంగా ఉన్న సులబ్ కాంప్లెక్స్ లో పనిచేసేవాడు. కాగా అతనికి, నిందితుడికి రూ.10 వేల విషయంలో వాగ్వాదం జరిగింది. గొడవ తార స్థాయికి చేరడంతో నిందితుడు మిధున్ని కత్తితో అతికిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం చార్మినార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. కోపాన్ని అదుపు చేసుకోలేక హత్య చేసినట్లు అంగీకరించాడు. చార్మినార్ పోలీసులు మిథున్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also: దయచేసి ఆలోచించండి.. హుస్నాబాద్ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి
Follow us on: Google News, Koo, Twitter