హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు(Hyderabad Metro) పొడగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం త్వరగా డిపిఆర్ లను సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా నేడు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ లతో మెట్రో(Hyderabad Metro) పొడగింపు కారిడార్ ల విషయంపై చర్చించారు. గతంలో మల్కాజ్గిరి ఎంపీ గా ఉన్న సమయంలో ట్రాఫిక్ సమస్యలపై, రూట్ మ్యాప్ లపై అవగాహన ఉందన్నారు. అలాగే రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్ సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని మెట్రో ఎండీ కి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
డిపిఆర్ ను 3 నెలల్లో సిద్ధం చేయాలని, ఫేజ్ 2 ‘ఏ’ మాదిరిగానే ‘బి’ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్ట్ గా రూపొందించి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని మెట్రో ఎండీ కి తెలిపారు. హైదరాబాద్ వాసులకు మరో 45 కిలో మీటర్ల మేర మెట్రో అందుబాటులోకి రానుంది.
Hyderabad Metro ఏఏ ప్రాంతాలకు :
ప్యారడైజ్ to మేడ్చల్ వరకు 23 కిలో మీటర్లు… ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్.
జేబీఎస్ to శామీర్‌పేటకు వరకు 22 కిలో మీటర్లు.. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్‌పురి, కార్ఖాన, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట, తూంకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట.