Hyderabad | మరో 20 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. గ్రాండ్‌గా 2024 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పేందుకు అందరూ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని సూచించారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు.
Hyderabad | ఈవెంట్లలో కెపాసిటీ మించి పాసులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని.. సాధారణ పౌరులను ఇబ్బందులకు గురి చేయవొద్దని తెలిపారు. వేడుకల్లో డ్రగ్స్ వాడినా.. సమయానికి మించి లిక్కర్ సరఫరా చేసినా కఠిన చర్యలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. అలాగే తాగి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామని వెల్లడించారు.
Read Also: కమిన్స్ రికార్డును గంటల్లోనే బద్దలుకొట్టిన మిచెల్ స్టార్క్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat