Hyderabad traffic: స్పెషల్ డ్రైవ్‌‌లో 3535 ఉల్లంఘనలు నమోదు

-

Hyderabad traffic cops booked 3535 cases against wrongside driving: ట్రాఫిక్ కంట్రోల్, ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులు సోమవారం రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ పై స్పెషల్ డ్రైవ్ చేసిన విషయం తెలిసిందే. కాగా..ఈ డ్రైవ్‌‌లో 3535 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ డ్రైవ్‌‌ను 50 ప్రధాన మార్గాల్లో చేపట్టారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌‌లో 2981, ట్రిపుల్ రైడింగ్స్‌‌లో 554 కేసులను ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు. అయితే.. భారీగా చలాన్లు బాకీ ఉన్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రూల్స్‌‌కు విరుద్ధంగా నగరంలో తిరుగుతున్న ఇతర జిల్లాలకు చెందిన ఆటోలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే.. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు సర్వేలో తేలడంతో ఈ (Hyderabad traffic) ఆంక్షలను అమలు చేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ పై నగర ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...