Hyderabad Traffic Rules More Strict From Today: హైదరాబాద్ ట్రాఫిక్ రూల్స్‌ను నేటి నుంచి మరింత పకడ్బంధీగా అమలు చేయనున్నారు. ట్రాఫిక్ కంట్రోల్, ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు సర్వేలో తేలడంతో ఈ ఆంక్షలను అమలు చేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ పై నగర ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు రూల్స్ కఠినంగా అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. రూల్స్ బ్రేక్ చేస్తే ఎక్కువ మొత్తంలో జరిమానాలు వేస్తామని.. ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200, రాంగ్ రూట్లో వచ్చే వాహనాలకు రూ.1700 ఈ ఫైన్‌లను ప్రభుత్వ జీవో ప్రకారం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు.