టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)కి భారీ షాక్ తగిలింది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేసిన కట్టడాలపై హైడ్రా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణం అని రుజువైతే బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీకి జలకిచ్చింది హైడ్రా. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్(N Convention) హాల్ ను శనివారం ఉదయం కూల్చివేసింది. తుమ్మిడికుంట చెరువులోని మూడున్నర ఎకరాలు ఆక్రమించి నిర్మించారన్న అభియోగాల నేపథ్యంలో హైడ్రా(HYDRA) యాక్షన్ తీసుకుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్యన కూల్చివేతలను చేపట్టింది.