MLC Jeevan Reddy | అది నిరూపిస్తే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జీవన్ రెడ్డి

-

ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేసినట్లు నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. 20222లో ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌తో అయినా 24 గంటల విద్యుత్(24 Hrs Power) సరఫరా చేశారా..? అని ప్రశ్నించారు. కేసీఆర్(KCR) ప్రతి పథకానికి కాంగ్రెస్ పథకాలే ఆధారం అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధితోనే జగిత్యాలకు గుర్తింపు వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌(Koppula Eshwar)ను ప్రజలు ముక్కు నేలకి రాపిస్తారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. ఈ నెల 22న దశాబ్ది దగా పేరుతో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పడిందని.. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టారని జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) అన్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసి.. పుట్టబోయే ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల భారం మోపారని తెలిపారు. దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు.

- Advertisement -
Read Also:
1. ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
2. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...