గత కొన్ని రోజులుగా మిస్టరీగా మారిన హైదరాబాద్‌లో అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి కార్తీక్(IIT Student Karthik) విశాఖ బీచ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకి చెందిన కార్తీక్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం (మెకానికల్) చదువుతున్నాడు. ఈనెల 17వ తారీఖున ఐఐటీ క్యాంపస్ నుంచి వెళ్లిపోగా.. 19వ తారీఖున కార్తీక్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వైజాగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సంగారెడ్డి పోలీసులు వైజాగ్‌కి వెళ్లి విద్యార్థి కోసం తీవ్రంగా గాలించగా మంగళవారం కార్తీక్ మృతదేహం లభ్యమైనది. కార్తీక్ మృతదేహాన్ని వైజాగ్‌లోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
IIT Student Karthik | విశాఖలో హైదరాబాద్ IIT విద్యార్థి ఆత్మహత్య
-