ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదం ఘటన జరిగిన నాలుగు రోజులు గడిచినా లోపల చిక్కుకున్న వారి ఆచూకీ కూడా తెలియలేదు. ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, సింగరేణి, ఎన్‌జీఆర్ఐ, జీఎస్ఐ, ర్యాట్ మైనింగ్ బృందం, మేఘా, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాస్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్నాయి. అయితే లాభం లేకుంది. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్.. జీరో పాయింట్ వద్దకు చేరుకున్నాయి. కాగా 1600 టన్నుల బరువున్న టీబీఎం మిషన్‌ను అడ్డు తొలగిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. రిస్క్ తీసుకుంటే రెస్క్కూ బృందాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆ ప్రాంతాన్ని ఇంజినీర్లు డేంజర్ జోన్‌గా చెప్తున్నారు. బురద, నీరు, సామాగ్రిని తొలగిస్తేనే కార్మికుల ఆచూకీని గుర్తించడం సాధమ్యమవుతుందని చెప్తున్నారు. దీంతో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రెస్క్యూ ఆపరేషన్స్‌ను ముందుకు కొనసాగించడం కోసం మార్కోస్‌ను రంగంలోకి దించుతోంది ప్రభుత్వం. ఇందుకోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అదే ‘ఆపరేషన్ మార్కోస్(Operation Marcos)’. ఈ ఆపరేషన్ చేపట్టడానికి మరికాసేపట్లు ఇండియన్ మెరెన్ కమాండో ఫోర్స్ చేరుకోనుంది. నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా.. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా సహాయక చర్యలను విజయవంతంగా చేపట్టే సత్తా ఈ మార్కోస్‌కు ఉంటుంది. ఎన్‌డీఆర్ఎస్, ఎస్‌డీఆర్ఎస్ ఇంజనీర్లతో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌లో మార్కోస్ కూడా పాలుపంచుకోనున్నారు. బోర్డర్ ఆఫ్ ఆర్గైజేషన్(బీఆర్ఓ) లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్ సింగ్ తన బృందంతో టన్నెల్(SLBC Tunnel) వద్దకు చేరుకోనున్నారు.