Inorbit Durgam Cheruvu run 2023: మూడవ ఎడిషన్ ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ (ఐడీసీఆర్) 2023 పవర్డ్ బై ఆల్ట్ లైఫ్ , (షాపర్స్‌స్టాప్ కు చెందిన బ్రాండ్)విజయవంతంగా ముగిసింది. ఈ సంవత్సరం ఆరు వేల మందికి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా గత సంవత్సరంతో పోలిస్తే 100% వృద్ధి నమోదయింది. హాఫ్ మారథాన్ పోటీలో జేమ్స్ కిప్లీటింగ్ కోరిర్, హెత్ రామ్, రమావత్ రమేష్ చంద్రలు మొదటి మూడు స్ధానాల్లో నిలిచారు. 10కిలోమీటర్ల పరుగులో హుకమ్ హుకమ్, దీపక్ సుహాగ్, లక్ష్మీషా సీఎస్‌లు వేగవంతమైన రన్నర్లుగా నిలిచారు.
ఈ రన్ ఇనార్బిట్ మాల్, హైదరాబాద్ వద్ద ఆదివారం ఉదయం ప్రారంభమైంది. 21 కిలోమీటర్లల రన్‌ను తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక మరియు గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీస్ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఐఏఎస్ ; కె రహేజా కార్పోరేషన్ తెలంగాణా–ఏపీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రావణ్ గోనె ప్రారంభించగా 10కె రన్‌ను తెలంగాణా ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ;శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య , తెలంగాణా ఐటీ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్ రెడ్డి ; టీఎస్‌ఐఐసీ జోనల్ మేనేజర్ శ్రావణ్‌కుమార్ ప్రారంభించారు. 5కె రన్‌లో దాదాపు 3వేల మంది పాల్గొన్నారు. ఈ రన్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ , సైబరాబాద్ ట్రాఫిక్ పొలీస్ జాయింట్ కమిషనర్ కె నారాయణ్ నాయక్, ఐపీఎస్ ; సైబరాబాద్ లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి , సైబరాబాద్ పోలీస్, ఎస్‌సీఎస్‌సీ సెక్రటరీ కృష్ణ యెదుల ప్రారంభించారు.
ఓ మహోన్నత కారణం కోసం ఐడీసీఆర్ రన్‌ను నిర్వహించారు. ఈ రన్ ద్వారా 54 లక్షల రూపాయలను సమీకరించారు. ఈ నిధులను తమ ఎన్‌జీవో భాగస్వామి నిర్మాణ్ ద్వారా దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాల కోసం వినియోగించనున్నారు.
ఈ సంవత్సరం 25 కార్పోరేట్ సంస్ధల ఉద్యోగులు సైతం రన్‌లో పాల్గొన్నారు. ఐటీ పార్క్ మైండ్‌స్పేస్ నుంచే 850 రిజిస్ట్రేషన్‌లు ఈసారి జరిగాయి.
హైదరాబాద్‌లో అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారథాన్ అండ్ డిస్టెన్స్‌రేసెస్ (ఎయిమ్స్) ధృవీకరణ పొందిన రెండు రేస్‌లలో ఐడీసీఆర్ ఒకటి. ఈ సంవత్సరం ఐడీసీఆర్‌కు ఆల్ట్ లైఫ్ బై షాపర్స్ స్టాప్ పవర్డ్ బై పార్టనర్‌గా, కమల్ వాచ్ కో టైమింగ్ పార్టనర్‌గా, హైడ్రేషన్ పార్టనర్‌గా లిమ్కా స్పోర్ట్జ్, రన్నింగ్ పార్టనర్‌గా స్కెచర్స్, రేడియో పార్టనర్ ఫీవర్ ఎఫ్‌ఎం వ్యవహరించాయి.