Inter student died due to medical malpractice in ONUS Hospital: వైద్యం వికటించి ఓ విద్యార్థి మృతి చెందడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి చౌరస్తాలో ఉన్న ONUS ఆసుపత్రిలో చోటు చేసుకుంది. హనుమోను పల్లి గ్రామం మాడుగుల మండలంకు చెందిన ఇంటర్ విద్యార్థి రోహిత్ రెడ్డికి డెంగీ వ్యాధి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు రోహిత్‌ను ఈ నెల 1న ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. బుధవారం రాత్రి రోహిత్ ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు ప్లేట్ లేట్ ఎక్కించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిని రోహిత్ గురించి అడిగి తెలుసుకోగా.. సీరియస్‌గా వుందని తెలిపారు. కానీ ఈ రోజు ఉదయం రోహిత్ చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు వైద్యం వికటించి చనిపోయాడని ఆరోపించారు. ఆసుపత్రి వర్గాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.