IT Raids on Minister Mallareddy :తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లతో పాటు మెడికల్ కాలేజీలు, ఆఫీసుల్లో, మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు ఇతర బంధువుల ఇళ్లపైనా ఐటీ సోదాలు ముగిశాయి. ఈ దాడుల్లో ఐటీ అధికారులు సుమారు 18.5కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాక.. 15కిలోల బంగారు ఆభరణాలను అధికారులు కనుగొన్నాట్లు సమాచారం. దీంతో మంత్రి మల్లారెడ్డి సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే.. నోటీసులు వచ్చిన అందరు సోమవారం నుంచి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ ఐటీ సోదాలపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్షపూరితమైన చర్య అని.. ఐటీ దాడులతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.