IT Raids on Minister Mallareddy: బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది

0
Minister Malla Reddy

IT Raids on Minister Mallareddy Mallareddy Fires on Income Tax Officials: ఐటీసోదాలపై మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. తమ ఇంటిపై ఐటీ దాడులు రాజకీయ కక్ష్యతో చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. నేను దొంగ వ్యాపారాలు చేస్తున్నానా?. లేదా స్మగ్లింగ్, క్యాసినోలు ఆడిస్తున్నానా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పేద పిల్లలకు చదువు అందిస్తున్నాను.. రూ.35వేలకు ఇంజినీరింగ్, ఎంబీఏ చదివును అందిస్తున్నాను అని అన్నారు. 200మందికి పైగా అధికారులను పంపించి బీజేపీ దౌర్జన్యం చేస్తూ.. దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. అయతే.. రెండో రోజు మల్లారెడ్డి నివాసంతో పాటు మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డితో పాటు ఇతర బంధువుల ఇళ్లపైనా ఐటీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఐటీ సోదాల సమయంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి హుటాహుటిన సూరారంలోని ఆస్పత్రికి బయల్దేరారు. దీంతో మంత్రితో పాటు ఐటీ అధికారులు కూడా ఆస్పత్రికి వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here