JaggaReddy: మునుగోడులో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని, బీజేపీకి క్యాడర్ లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీలు అధికారంలో ఉండి అంగ బలాన్ని, అర్థ బలాన్ని ఓటర్ల పై ప్రయోగించడానికి చూస్తున్నారని మండిపడ్డారు. కొయ్యలగూడెంలో దాదాపు 2200 ఓట్లు ఉన్నాయి.. కానీ ఎన్నికల్లో 2000 ఓట్లు మాత్రమే పోల్ అవుతాయని.. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా గట్టిగా స్రవంతి గెలుపు కోసం పనిచేస్తుందని తెలిపారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తుచేశారు. గోవర్ధన్ రెడ్డి కూతురే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుందని.. ప్రజలు కచ్చితంగా ఆమెని ఆశీర్వదించాలని JaggaReddy కోరారు.
Read also: తిరుపతిలో ఈనెల 29న ఆత్మ గౌరవ మహా ప్రదర్శన