తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్ ముఖ్యమంత్రిని తానేనని వ్యాఖ్యానించారు. సంగారెడ్డితో పాటు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో వచ్చే పదేళ్లలో తాను సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. దసరా సందర్భంగా తన మనసులో మాటలను చెబుతున్నానని పేర్కొన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీనినెవరూ కాదనలేరని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నోరు అదుపులో పెట్టుకోవాల్సి వచ్చిందని లేదంటే చాలా విషయాలను మీతో పంచుకునే వాడినని చెప్పుకొచ్చారు.
రాజకీయ దుమారం రేపుతున్న జగ్గారెడ్డి(Jaggareddy) వ్యాఖ్యలు..
తనను ఈ ఎన్నికలలో పోటీ చేయకుండా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన పోటీపై కుట్రలు చేసినా నా భార్య పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. . తన కంటే ఆమే బెటర్ అని.. తాను ఫోన్‌లో దొరకను గానీ ఆమె మాత్రం ఎప్పుడు ఫోన్లో బాధితులకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజల ఆశీర్వాదం తనపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు. కాగా కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి పేరు ప్రకటించన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు తనపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు తానే భవిష్యత్ సీఎం అంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
Read Also: శ్రీవారి దర్శనం చేసుకున్న నారా భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ యాత్రకు సిద్ధం..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat