చిరుత వేటకు హైదరాబాది హెల్ప్ కోరిన జార్ఖండ్ ప్రభుత్వం

-

Jharkhand Govt Seeks Hyderabad Based hunter Nawab Shafath Ali Khan to Catch leopard: ఈ మధ్య చిరుతపులులు అడవులను వదిలి జనావాసంలోకి వస్తున్నాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలను చిరుత భయం వెంటాడుతోంది. తరచూ గ్రామాల్లోకి వచ్చి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా ఝార్ఖండ్ లోని పలమూ డివిజన్లో 50 గ్రామాల ప్రజలకు చిరుత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 20 రోజుల వ్యవధిలో నలుగురు చిన్నారులను హతమార్చింది. దీంతో ఆయా గ్రామాల్లో సాయంత్రం తర్వాత ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

చిరుతను పట్టుకునేందుకు అధికారులు ట్రాప్ కెమెరాలు, డ్రోన్ల ఏర్పాటు వంటి శాఖాపరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ వేటగాడిగా పేరుగాంచిన హైదరాబాదీ షూటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్(Nawab Shafath Ali Khan) సాయాన్ని ఝార్ఖండ్ ప్రభుత్వం కోరింది. ఇదే అంశంపై ఉన్నతాధికారి శశికర్ మాట్లాడుతూ.. వీలైనంత వరకు చిరుతకు మత్తు మందు ఇచ్చి బందించేందుకు ప్రయత్నిస్తామని, చివరి ప్రయత్నంగా చిరుతను అంతమొందిస్తామని తెలిపారు. వేటలో నిష్ణాతుడైన హైదరాబాదీ షూటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ సాయాన్ని కోరామని వెల్లడించారు. ఆయన దగ్గర అత్యాధునిక సామాగ్రి ఉన్నట్లు శశికర్ తెలిపారు. ఝార్ఖండ్ ప్రభుత్వం చిరుత వేటకు సంబంధించి తనను సంప్రదించిందని షఫత్ అలీ ఖాన్ ధ్రువీకరించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...