చివరి నిమిషంలో ట్విస్ట్.. నడ్డా తెలంగాణ పర్యటన రద్దు

JP Nadda

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తెలంగాణ పర్యటన రద్దయింది. మార్చి 31న జేపీ నడ్డా సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసును ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని జేపీ నడ్డా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అక్కడి నుంచే కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలను సైతం జేపీ నడ్డా వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో జరిగే కార్యక్రమానికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పాల్గొననున్నారు.

Read Also: కేసీఆర్‌ను ఎందుకు భరించాలి.. ఎందుకు సహించాలి

Follow us on: Google News, Koo, Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here