కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో బీజేపీ అప్రమత్తమైంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేకంగా తెలంగాణపై దృష్టి సారిస్తోంది. పార్టీలో ఉన్న లుకలుకలను సెట్ రైట్ చేస్తూ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) అన్నారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నోవాటెల్ హోటల్‌లో దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. లీకులతో పార్టీకి నష్టం జరిగింది. ఇకపై అలా చేయవద్దని జేపీ నడ్డా సున్నితంగా హెచ్చరించారు.
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీరియస్‌గానే నడ్డా(JP Nadda) హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లోల సౌత్ జోన్‌లో 170 ఎంపీ సీట్ల టార్గెట్ పెట్టుకున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థానికంగా బలోపేతం కావడం.. క్షేత్రస్థాయిలో ఐక్యత చూపించాలని నడ్డా అన్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఇప్పటికే 2024 లోక్‌సభ ఎన్నికలకు కమలనాథుల రోడ్ మ్యాప్ రెడీ చేశారు.
Read Also: ప్రధాని మోడీపై సొంత పార్టీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat