తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli Statue) విషయంలో తీవ్ర వివాదం జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరోకరు ఎత్తి చూపుతూ వారు విమర్శలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకున్నాయి.
ఈ క్రమంలోనే ఈరోజు రాజకీయ ప్రముఖులు సహా పలువరు ముఖ్యలను ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహానిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాగా ఇంతలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli Statue) రూపం మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. విగ్రహ ఆవిష్కరణను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జూలూరు గౌరీశంకర్.. పిటిషన్ దాఖలు చేశారు.
విగ్రహం రూపం మార్చడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం రిజిస్ట్రీ పిరశీలనతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.