Jupally Krishna Rao | కాంగ్రెస్‌లోకి జూపల్లి కృష్ణారావు.. చేరిక తేదీ ఖరారు

-

బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) కాంగ్రె‌లో చేరే తేదీ ఖరారైంది. ఇవాళ ఉదయం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) నివాసంలో జూపల్లి కొల్లాపూర్ సభపై చర్చించారు. పాదయాత్ర విజయవంతంపై భట్టికి జూపల్లి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. కొల్లాపూర్‌(Kollapur)లో జరగబోయే బహిరంగ సభకు రావాలని భట్టిని కోరినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అనేక విషయాలు యాత్రలో తెలుసుకున్నట్లు భట్టి చెప్పారన్నారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లా నేతలంతా కలిసి మాట్లాడుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

సభకు జాతీయ నేతలు రాబోతున్నారని.. సభను సక్సెస్ చెయ్యాలని చూస్తున్నామన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి నేతల చేరికలు ఉంటాయన్నారు. కూచుకుల్లా దామోదర్ రెడ్డి(Kuchukulla Damodar Reddy) ఆయన కుమారుడు, మేఘా రెడ్డితో పాటు చాలామంది నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని 14 నియోజకవర్గాల నేతలు ఈ నెల 20న కొల్లాపూర్‌లో కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సభలో కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నారని తెలిపారు.

Read Also: సీతక్కను ముఖ్యమంత్రి చేస్తాం: రేవంత్ రెడ్డి

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...