బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి(Ponguleti Srinivas Reddy) ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆదివారం ఖమ్మంలో ప్రజా శాంతి పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాల్ మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలోకి రావాలని కోరారు. పొంగులేటి, జూపల్లి కృష్ణారావు మిగతా నేతలు కలిసి ఇండిపెండెంట్‌గా పార్టీ పెడితే ఒక్క సీటు గెలవలేరు. కాంగ్రెస్ ఇంకో 50 ఏళ్లు ఉన్నా అధికారంలోకి రాలేదు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి 17 మంది నేతలు నన్ను ప్రధాని అవుతారని సపోర్ట్ చేస్తామన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మా పార్టీలోకి రండి. నేను ఆరు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా చేస్తా.. జాయిన్ ఎప్పుడు అవుతారో చెప్పండి.. లక్ష మందితో మీటింగ్ పెడతా. పొంగులేటికి బీసీలు ఓట్లు వేయరు. మా పార్టీలో చేరితే పొంగులేటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా..” అని కేఏ పాల్(KA Paul) ఆఫర్ ఇచ్చారు.