KA Paul | నన్ను కలవడానికి కేసీఆర్‌కు టైమ్ లేదా: కేఏ పాల్

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు అఖిలేష్ యాదవ్‌ను కలిసేందుకు టైమ్ ఉంది కాని నన్ను కలిసేందుకు టైమ్ లేదా అని ప్రశ్నించారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌(Pragathi Bhavan)లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన నేపథ్యంలో కేఏ పాల్(KA Paul) ప్రగతి భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రగతి భవన్ గేట్ వద్ద ఆయన కారును సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారు. ముందస్తు అనుమతి లేనిదే లోపలికి పంపడం కుదరదని చెప్పడంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం లోపల ఉండగా తనను ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కంటే నేనే గొప్ప లీడర్‌ను అని, ఆయన నేను మంచి మిత్రులమని అన్నారు. అందువల్ల తనకు లోపలికి అనుమతి ఇవ్వాలని కోరారు. అయినా పోలీసులతో లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో వాగ్వాదానికి దిగారు.

- Advertisement -
Read Also:
1. మాది బీటీమ్ కాదు ఢీ టీమ్.. రాహుల్ గాంధీకి కేటీఆర్ కౌంటర్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...